Saturday, September 19, 2020

Pratah Sandhyavandanamu - ప్రాతః సంధ్యావందనము

కృష్ణ యజుర్వేదీయ సంధ్యావందనము

ప్రాతః సంధ్యావందనము

ప్రోక్షణ

సూర్యోదయానికి ముందు తూర్పు దిశగా సుఖాసనమున కూర్చొని నమస్కారం చేస్తూ

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం'' గతోఽపివా |

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః

శిరస్సు మీద జలమును కుడిచేతి బ్రొటన వ్రేలితో చల్లుకుంటూ

ఓం పుండరీకాక్షాయ నమః  ! పుండరీకాక్షాయ నమః  ! పుండరీకాక్షాయ నమః |

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః   ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )
ఓం నారాయణాయ నమః ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః      ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః  ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః           ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః            ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                    ( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము )        

ఓం హృషీకేశాయ నమః                (  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )    

ఓం పద్మనాభాయ నమః               (  అరచేతితో నాభియందు )

ఓం దామోదరాయ నమః               ( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీ వాసుదేవాయ నమః          ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం👇

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

కుంభకం  ( రెండు ముక్కులను మూసి ) 👇

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  👉 భూ-ర్భువ-స్సువరోమ్

సంకల్పము

ఎడమ అరచేతియందు కుడి చేతిని అడ్డంగా బోర్లించి, రెండు చేతులను కలిపి కుడి తొడ యందుంచి ( బ్రహ్మ ముడి లేదా బ్రహ్మగ్రంథి పట్టుకోనవసరం లేదు. పట్టుకున్నా పర్వాలేదు. )

శ్రీ గోవింద ! గోవింద ! గోవింద ! శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్తమానస్య, అద్య బ్రాహ్మణః, ద్వితీయ

 పరార్దే, శ్రీ శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, 

భరత ఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీ రంగస్య ఉత్తర దిక్ప్రదేశే, గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే, భగవత్

 భాగవతాచార్య సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన, ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే

 ---------సంవత్సరే -------- అయనే ----ఋతౌ ---- మాసే ----- పక్షే ---- తిథౌ ---- వాసరే ---- నక్షత్రే

 శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య

 కైంకర్యరూపేణ ప్రాతః సంధ్యావందనం కరిష్యే.

కుడి ఉంగరం వ్రేలితో నీటిని తాకవలెను.

మార్జనము 

జలమును శిరస్సున చల్లుకుంటూ

ఓం ఆపోహిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో వః' శివత'మో రసః'

 | తస్య' భాజయతే  నః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అరంగమామవః |

 యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః |

జలాభి మంత్రణః  ( అరచేతిలోనికి నీటిని తీసుకొని)

ఓం సూర్యశ్చ, మామన్యు శ్చ, మన్యుపతయశ్చ, మన్యు'కృతేభ్యః | పాపేభ్యో' రక్షంతామ్ | యద్రాత్ర్యా

 పాప' మకార్షం | మనసా వాచా' హస్తాభ్యాం | పద్భ్యా ముదరే'ణ శిశ్నా | రాత్రి స్తద'వలుంపతు |

 యత్కించ' దురితం మయి' | ఇదమహం మా మమృ'త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో'మి స్వాహా''

అని చేతిలోని జలమును త్రాగవలెను

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )
ఓం నారాయణాయ నమః               ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                     ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )
ఓం గోవిందాయ నమః                  
( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                           ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )
ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                  ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )
ఓం వామనాయ నమః                   
( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                      ( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము )        
ఓం హృషీకేశాయ నమః                
(  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )    

ఓం పద్మనాభాయ నమః                 (  అరచేతితో నాభియందు )
ఓం దామోదరాయ నమః               
( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

మార్జనము 

బొటన వ్రేలితో జలమును శిరస్సున చల్లుకుంటూ

ఓం దధి క్రావణ్ణో' అకారిషం | జిష్ణో రశ్వ'స్య వాజి'నః |

సురభినో ముఖాకరత్  ప్రణ ఆయూగ్ం'షి తారిషత్


ఓం ఆపో
 హిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే |

 యో వః' శివత'మో రసః' | తస్య' భాజయతే హనః | ఉశతీరి'వ మాతరః' | తస్మా అరంగమామవః |

 యస్య క్షయా'య జిన్వ'థ | ఆపో' జనయ'థా చ నః  

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )
ఓం నారాయణాయ నమః              
( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                     ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )
ఓం గోవిందాయ నమః                   ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                           ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )
ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                  ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )
ఓం వామనాయ నమః                    ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                      ( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము )        
ఓం హృషీకేశాయ నమః                
(  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )    

ఓం పద్మనాభాయ నమః                 (  అరచేతితో నాభియందు )

ఓం దామోదరాయ నమః                ( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

అర్ఘ్యప్రదానము

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య కైంకర్యరూపేణ

 ప్రాతః సంధ్యావందన అర్ఘ్యప్రదానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని స్పృసించి, లేచి నిలబడి, దోసిలితో నిండా నీరు తీసుకొని కాళ్ళ మడమలెత్తి రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ అంచుల నుండి, ( ఈ క్రింది మంత్రం చదువుతూ ) పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా నీటిని వదలవలెను.      ఇలా 3 సార్లు అర్ఘ్యము విడి విడిగా వదలవలెను

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ప్రాణాయామము

పృధివ్యాః మేరోః పృష్ఠ ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

చతుర్ధార్ఘ్యం ( కాలాతిక్రమణ దోష పరిహారర్ధం)

ఒక వేళ సంధ్యావందనమునకు సమయము మించి పోతే, పరిహారార్థం మరొకసారి అర్ఘ్య ప్రధానము చేయవలెను.)

ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారర్ధం చతుర్ధార్ఘ్య ప్రదానం కరిష్యే అని కుడి ఉంగరం వ్రేలితో నీటిని తాక వలెను. లేచి నిలబడి మరియొక మారు అర్ఘ్య ప్రదానం చేయవలెను.

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య కైంకర్యరూపేణ

 ప్రాతః సంధ్యావందన అర్ఘ్యప్రదానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని స్పృసించి, లేచి నిలబడి, దోసిలితో నిండా నీరు తీసుకొని కాళ్ళ మడమలెత్తి రెండు చేతుల చిటికెన వ్రేళ్ళ అంచుల నుండి,( ఈ క్రింది మంత్రం చదువుతూ ) పైకి చిమ్ముతున్నట్లు తన కాలిపై పడకుండా నీటిని వదలవలెను.     

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

కుడి చేతిలోనికి నీరు తీసుకొని ప్రదక్షిణ చేసి, ఎవరిపైన పడకుండగ తలచుట్టూ త్రిప్పుచూ

" ఆసావాదిత్యో బ్రహ్మ" అంటూ నీరు విడవలెను.

తర్పణం

లేచి నిలబడి నీళ్ళను వదులుతూ ద్వాదశ నామాలతో దేవతా తర్పణము చేయవలెను.

ఓం కేశవం తర్పయామి

ఓం నారాయణం తర్పయామి

ఓం మాధవం తర్పయామి

ఓం గోవిందం తర్పయామి

ఓం విష్ణుం తర్పయామి

ఓం మధుసూధనం తర్పయామి

ఓం త్రివిక్రమం తర్పయామి

ఓం వామనం తర్పయామి

ఓం శ్రీధరం తర్పయామి 

ఓం హృషీకేశం తర్పయామి  

ఓం పద్మనాభం తర్పయామి  

ఓం దామోదరం తర్పయామి

ఓం శ్రీ వాసుదేవం తర్పయామి

ప్రాణాయామము ( కూర్చొని )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ఓం భూరాది సప్తవ్యాహృతీనాం, అత్రి, భృగు కుత్స, వసిష్థ,గౌతమ, కాశ్యప, ఆంగీరసో ఋషయః

                                                    ( శిరస్సును స్పృశిస్తూ )

గాయత్రీ ఉష్ణిక్, అనుష్టుప్ బృహతీ పంక్తిః త్రిష్టుప్ జగత్యశ్చందాంసి   ( నాసికను స్పృశిస్తూ )

 అగ్ని వాయవ్యర్క, వాగీశ, ఇంద్ర, వరుణ, విశ్వేదేవా, దేవతాః, ఓ మాప ఇత్యస్య బ్రహ్మ ఋషిః,

అనుష్టుప్ ఛందః, పరమత్మా దేవతా ప్రాణాయామే వినియోగః         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయమము 11 సార్లు చేయవలెను

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి

 ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

గాయత్రీ ఆవాహన

(  కూర్చొని దోసిలి తెరిచి ఆహ్వానముద్ర చూపిస్తూ )

ఓం ఆయా'తు వర'దా దేవీ అక్షరం' బ్రహ్మ సమ్మితం | గాయత్రీం'' ఛంద'సాం మాతేదం బ్ర'హ్మ జుషస్వ

 నః| ఓజో'ఽసి సహో'ఽసి బల'మసి భ్రాజో'ఽసి దేవానాం ధామనామా'సి విశ్వ'మసి విశ్వాయు-

స్సర్వ'మసి సర్వాయు-రభిభూరోం |

అని హృదయము లోనికి భగవానుణ్ణి ఆహ్వానిస్తున్నట్లు తన వైపు తిప్పుకుంటూ

గాయత్రీ-మావా'హయామి 

సావిత్రీ-మావా'హయామి 

సరస్వతీ-మావా'హయామి

గాయత్ర్యా విశ్వామిత్రో ఋషిః                                        ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                                                   ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే         (హృదయమును స్పృశిస్తూ )

అని ఉంగరం వ్రేలితో నీటిని తాకి నిలబడవలెను

గాయత్రీ జపం

నాసికకు ఎదురుగా రెండు చేతులను కలిపి వ్రేళ్ళపై లెక్కించుటకై వస్త్రముతో మూసుకొని గాయత్రీ

 మంత్రమును జపించాలి. యఙోపవీతమును పట్టుకోనవసరం లేదు.సూర్య మండలమున

 పద్మాసీనుడు, సర్వాభరణ భూషితుడు, శంఖ చక్రాద్యాయుధ ధారియగు నారాయణుని మనస్సున

 ధ్యానిస్తూ ( ఉదయము, మధ్యాహ్నము నిలిచియు సాయంత్రమున కూర్చొని) సూర్యునికి అభిముఖుడై

ఓం భూర్భువస్సువః' తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి |

ధియో యో నః' ప్రచోదయా''త్

దీనితో పాటు అష్టాక్షరీ మంత్రమును చేర్చుటయు ఆచారము కలదు.  ఇట్లు 10, 28, 108, 1008

 సార్లు కాని జపమును చేయవలయును.

గాయత్ర్యా గాయత్రీ ఛందో గాయత్రీ మహా మంత్ర జపం సంపూర్ణం.  అని చేతిలోనికి జలమును

 తీసుకొని ఆ జలమును వదులుతూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అని కూర్చొని

ప్రాణాయామము చేయవలెను.

పృధివ్యాః మేరోః పృష్ట ఋషిః           ( శిరస్సును స్పృశిస్తూ )

సుతలం ఛందః                            ( నాసికను స్పృశిస్తూ )

కూర్మో దేవతా, ఆసనే వినియోగః       (హృదయమును స్పృశిస్తూ )

ఓం అనంతాసనాయ నమః             ( ఆసనమును స్పృశిస్తూ )

ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః                ( శిరస్సును స్పృశిస్తూ )

దైవీ గాయత్రీ ఛందః                       ( నాసికను స్పృశిస్తూ )

పరమాత్మా దేవతా                         (హృదయమును స్పృశిస్తూ )

ప్రాణాయామే వినియోగః

కుడి బ్రొటన వ్రేలితోను, ఉంగరం వ్రేలితోను ముక్కును పట్టుకొని, మద్య వ్రేలును లోనికి మడచి

 ఉంచవలెను. కుడి ముక్కుతో గాలిని వదలి, ఎడమ ముక్కు తో గాలిని పీలుస్తూ....

పూరకం

ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యమ్ |

( రెండు ముక్కులను మూసి )

కుంభకం

ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి | ధియో యో నః' ప్రచోదయా''త్

ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మరేచకం

( కుడి ముక్కుతో గాలిని వదులుతూ )  భూ-ర్భువ-స్సువరోమ్

ప్రాతఃకాల సూర్యోపస్థానం (ఉపస్థానము)

సంకల్పము : పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం అస్యాం శుభ తిథౌ భగవత్ భాగవతాచార్య

 కైంకర్యరూపేణ ప్రాతః సంధ్యా వందనోపస్థానం కరిష్యే

ఉంగరం వ్రేలితో నీటిని తాకవలెను.లేచి నిలబడి నమస్కారం చేస్తూ

ఉత్తమే' శిఖ'రే దేవీ భూమ్యాం ప'ర్వతమూర్థ'ని | బ్రాహ్మణే''భ్యోఽ హ్య'ను జ్ఞానం

 గచ్చదే'వి యథాసు'ఖమ్ |

మిత్రస్య' చర్షణీ ధృత శ్రవో' దేవస్య' సాన సిం | సత్యం చిత్రశ్ర' వస్తమం | మిత్రో జనాన్' యాతయతి

 ప్రజానన్-మిత్రో దా'ధార పృథివీ ముతద్యాం | మిత్రః కృష్టీ రని'మిషాఽభి

 చ'ష్టే సత్యాయ' హవ్యం ఘృతవ'ద్విధేమ | ప్రసమి'త్త్ర మర్త్యో' అస్తు ప్రయ'స్వా న్యస్త'

 ఆదిత్య శిక్ష'తి వ్రతేన' | న హ'న్యతే న జీ'యతే త్వోతోనైన మగంహో' అశ్నో త్యంతి'తో  దూరాత్

దిగ్వందనం

తూర్పునకు చూస్తూ              సంధ్యా'యై నమః' |

దక్షిణం వైపుకి తిరిగి             సావి'త్ర్యై నమః' |

పడమర వైపుకి తిరిగి            గాయ'త్ర్యై నమః' |

ఉత్తరం వైపుకి తిరిగి             సర'స్వత్యై నమః' |

సర్వా'భ్యో దేవతా'భ్యో నమః' | కామోఽకార్షీ'' మన్యు రకార్షీ'' ర్నమో నమః |

ప్రవర

శిరస్సువంచి చేతులతో చెవులను స్పృసిస్తూ

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | -------- ఋషేయ ప్రవరాన్విత -------- గోత్రః

 --------- సూత్రః --------- శాఖాధ్యాయీ --------- దాస శర్మాహం అస్మీభో అభివాదయే

దిగ్వందనం

తూర్పునకు చూస్తూ              ప్రాచ్యై' దిశై నమః' |

దక్షిణం వైపుకి తిరిగి             దక్షిణాయై దిశై నమః' |

పడమర వైపుకి తిరిగి            ప్రతీ''చ్యై దిశై నమః' |

ఉత్తరం వైపుకి తిరిగి             ఉదీ''చ్యై దిశై నమః' |

పైకి చూస్తూ చేతులు ఎత్తి       ఊర్ధ్వాయ నమః' |

కిందకి చేతులు చూపిస్తూ      అధ'రాయ నమః' |

పైకి చూస్తూ                       అంతరిక్షాయ నమః |

కిందకి చూస్తూ                   భూమ్యై నమః

సూర్య వందనము ( నమస్కారం చేస్తూ )

ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |

కేయూరవాగ్మ్కర కుండలవాన్‌ కీరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః ||

శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయా అచ్యుతా!

గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం.

ప్రవర

శిరస్సువంచి చేతులతో చెవులను స్పృసిస్తూ

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | -------- ఋషేయ ప్రవరాన్విత -------- గోత్రః

 --------- సూత్రః --------- శాఖాధ్యాయీ --------- దాస శర్మాహం అస్మీభో అభివాదయే

ఆచమనము

అరచేతిని గోకర్ణాకృతిలో పెట్టి జలమును చేతిలో పోసి ఒక్కొక్క నామమును చెబుతూ త్రాగవలెను

ఒకటవసారి

ఓం అచ్యుతాయ నమః      ( నీటిని త్రాగవలెను )

రెండవసారి

ఓం అనంతాయనమః       ( నీటిని త్రాగవలెను )

మూడవసారి

ఓం గోవిందాయ నమః        ( నీటిని త్రాగవలెను )

ఓం కేశవాయ నమః                      ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి కుడివైపు )

ఓం నారాయణాయ నమః               ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేలుతో పెదవి ఎడమవైపు )

ఓం మాధవాయ నమః                     ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో కుడి నేత్రము )

ఓం గోవిందాయ నమః                   ( బ్రొటన వ్రేలు, ఉంగరం వ్రేళ్ళతో ఎడమ నేత్రము )

ఓం విష్ణవే నమః                           ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి నాసిక )

ఓం మధుసూదనాయ నమః            ( చూపుడు వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ నాసిక )

ఓం త్రివిక్రమాయ నమః                  ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో కుడి చెవి )

ఓం వామనాయ నమః                    ( చిటికెన వ్రేలు, బ్రొటన వ్రేళ్ళతో ఎడమ చెవి )

ఓం శ్రీధరాయ నమః                      ( ఐదు వ్రేళ్ళను కలిపి కుడి భుజము )   

ఓం హృషీకేశాయ నమః                 (  ఐదు వ్రేళ్ళను కలిపి ఎడమ భుజము )    

ఓం పద్మనాభాయ నమః                 (  అరచేతితో నాభియందు )

ఓం దామోదరాయ నమః                ( అరచేతితో హృదయము నందు )

ఓం శ్రీవాసుదేవాయ నమః               ( అరచేతితో శిరస్సు నందు స్పృసించాలి )

 

శ్రీ కృష్ణాయ నమః      శ్రీ కృష్ణాయ నమః      శ్రీ కృష్ణాయ నమః                29 సార్లు

సమర్పణము

కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |

కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ‖ 

( అని నీరు విడచి పెట్టవలెను )

( లేచి నిలబడి దక్షిణం వైపుకి తిరిగి ) 👇

శ్రీ రంగ మంగళ మణిం కరుణా నివాసం

శ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘం

శ్రీ హస్తి శైల శిఖరోజ్వల పారిజాతం

శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం

(  తీర్థమును వదులుతూ )👇

సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు


Madyahnika Sandhyavandanam - మధ్యాహ్నిక సంధ్యావందనము


Sayam Sandhyavandanamu - సాయం సంధ్యావందనము

Wednesday, September 16, 2020

Mukunda Mala (ముకుందమాల )


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ముకుందమాల 
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*1 వ శ్లోకం*

*ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినేదినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం !!*

*భావం :-*

పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన కులశేఖర మహారాజు శ్రీరంగనాథుని సేవించుటకు, భక్తులందరినీ తన వెంట తీసుకుపోవుచూ రంగయాత్రను గూర్చి తెలుపుచున్నారు. శ్రీరంగనాథుని గుణకీర్తనము చేయుచూ, భక్తి తన్మయులై ఈ యాత్రా విశేషాలు తెలుపుతూ ఉంటే సమయము గడిచిపోవుచున్నది.ఇదే విధంగా ప్రతీరోజూ జరుగుచున్నది. ఈవిధంగా శ్రీరంగనాథుని గుణానుభవముననే సమయము గడిపెడి భక్త కులశేఖర మహారాజుకు సాష్టాంగపడి నమస్కరించు చున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*2 వ శ్లోకం*

శ్రీవల్లభేతి వరదేతిదయాపరేతి
భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి!
నాథేతి నాగాశయనేతి జగన్నివాసే
త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!!

*భావం*

మహాభక్త శేఖరుడైన శ్రీకులశేఖర మహారాజు ముందుగా తన స్తోత్రారంభమున ముకుందుని గూర్చి ఈవిధంగా ప్రార్థించిరి ..ఓ ముకుందా ! ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా! వరదా! దయాపరా! భక్తప్రియా! భవ బంధాలను త్రెంపివైచే కోవిదుడా!నాథా!నాగశయనా!జగన్నివాసా!ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామీ!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*3 వ శ్లోకం*

జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద:

*భావం*

దేవకీ కుమారుడైన దేవదేవుని కి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవాను నికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడా నికి అవతరించిన ముకుందు నికి జయము జయము!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*4 వ శ్లోకం*

ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియం తమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేస్తుభవత్ప్రసాదాత్

*భావం*

(శ్రీకులశేఖర మహారాజు – మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం “ముకుంద”తో ప్రారంభమగుట వలన “ముకుందమాల” అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో ముకుంద దశాక్షరీమంత్రము నిక్షిప్తమై ఉన్నాడని పెద్దలు చెప్పుదురు.)

ఓ ముకుందా! నీకు శిరసు వంచి నమస్కరిస్తూ యాచిస్తున్నాను.నా మీద దయవుంచి నా ఈ చిన్న విన్నపాన్ని అలకించు.నేను ఎన్ని జన్మలనెత్తినా నీ పాదారవిందాలపై నా మనస్సు నిలిచి ఉండేటట్లు నన్ను అనుగ్రహించు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*5 వ శ్లోకం*

నాహం వందే తవ చరణయోర్ద్వంద్వహేతో:
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం

*భావం*

ఓ కృష్ణా! ద్వంద్వాతీతస్థితిని అందవలెనని కాని, కుంభీపాక నరకమును తప్పించుకొన వలెనని కాని, లావణ్యవతు లగు అప్సరసలను స్వర్గము లో అనుభవింపవలెనని కాని, నేను నీ పాదారవిందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము ఇచ్చినను సరే, నాకు అభ్యంతరము లేదు. కానీ సర్వదా మనసులో నిన్నే స్మరించునట్లు ఉండవలెనని యే నమస్కరించుచున్నాను.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*6 వ శ్లోకం*

నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంబోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు

*భావం*

ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించ వలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించ వలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగ వలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణ భక్తినే ముఖ్యముగా ప్రార్థించు చున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమ ని వారి ఆశయము)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*

*7 వ శ్లోకం*

దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి

*భావం*

(వెనుకటి శ్లోకంలో భగవంతుని తలచుట కంటే ఇతరములైన ఫలములను వేటినీ తాను కోరనని(కాంక్షించనని) చెప్పిన కులశేఖరులు ఈ శ్లోకంలో, ఈ ప్రదేశముననే ఉండవలెనను కోరిక కూడా నాకు లేదు అనుచున్నారు.)

ఓ నరకాంతక! కృష్ణా! స్వర్గము నందున్నను, లేదా ఈ భూమి యందే ఉన్నను నాకేమీ బాధ లేదు. కానీ శరత్కాల పద్మ సుందరములగు నీ చరణార విందములనే మరణ
సమయ మున కూడా ధ్యానించుచుందును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*8 వ శ్లోకం*

*కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం
అద్వ్యైవ మే విశతు మానస రాజహంస:
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తై:
కంఠావ రోధ నవిధౌ స్మరణం కుతస్తే*

*భావం*

కృష్ణా! మరణ సమయమున స్మరింతునని అంటిని కానీ, ఆవేళ కఫవాత పైత్యములచే కంఠము మూత పడినప్పుడు నీ స్మరణ కలుగునో కలుగదో కదా! కావున ఇప్పుడే నా మానస రాజహంసము విరోధు లెవ్వరూ చేరలేని వజ్ర పంజరమువలె ఉండు నీ పాద పద్మ మధ్యమున చేరుగాక
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*9 వ శ్లోకం*

చింతయామి హరిమేవ సంతతం
మంద మంద హసితాననాంబుజం
నందగోప తనయం పరాత్పరం
నారదాది మునిబృంద వందితం

*భావం*

నారదాదిమునీశ్వరులచే సేవింపబడుచుండు వానిని, పరాత్పరుని, నందగోపకుమారుని, నవ్వు రాజిల్లెడి మోమువానిని, కృష్ణుని ఎల్లప్పుడూ నేను ధ్యానించు చుందును.

(నాల్గవ శ్లోకం నుండి ఇంత వరకు అనన్య ప్రయోజనము గా సర్వదేశ సర్వకాల సర్వా వస్థల యందు అవిచ్ఛన్నము గా ఆటంకములు లేక హరి స్మరణమే తనకు కావలెనని కులశేఖరులు కోరినారు. ఆ కోరికను అనుసరించి లభించి న హరిని అనుభవించి తృప్తి తో ఈ శ్లోకమును చెప్పుచున్నారు)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*10 వ శ్లోకం*

కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే
శ్రమ ముషి భుజవీచివ్యాకులేగాధమార్గే
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరు పరిఖిన్న: ఖేదమద్యత్యజామి

*భావం*

నేను ఈ సంసారము అనెడి ఎడారిలో ప్రయాణము చేసి, చేసి బడలిక చెంది, నేడు ఈ హరి సరస్సును చేరితిని. ఆహా! ఎంత సుందరమూ ఈ సరస్సు! ఆ హరి కరచరణము లే మిలమిలలాడు చేపలు. భుజములే అందు కదలాడు కెరటములు. అది శ్రమలనన్ని టిని హరించును. ఆ రేవులు అవగాహనము (స్నానము) చేయుటకు అనుకూలముగా లోతు కలవై ఉండును. అందులోకి పోయి, ఆ తేజస్సు అనెడి జలమును కడుపు నిండుగా త్రాగి, నా బడలికను తీర్చుకొనుచున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*11 వ శ్లోకం*

సరసిజనయనే సశంఖచక్రే
మురభిధి మా విరమస్వ చిత్త రంతుం
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణ స్మరణామృతేన తుల్యం

*భావం*

ఓ మనస్సా! శ్వేత తామరలలాంటి నయనాలు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎప్పటికీ ఆయన స్మరణ మానవద్దు. శ్రీహరి పాదపద్మాలను స్మరించడం అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*12 వ శ్లోకం*

మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనా: నామీ న:
ప్రభవంతి పాపరిపవ: స్వామీ నను శ్రీధర:
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్య నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమా:

*భావం*

ఓ మూఢమైన మనసా! యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు. కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము. లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా !
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*13 వ శ్లోకం*

భవజలధిగతానాం ద్వంద్వ వాతాహతానాం
సుతదుహితృ కళత్ర త్రాణభారార్ధితానాం
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతోనరాణాం

*భావం*

సంసారమనే సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి,భార్యాబిడ్డలు మున్నగువారిని పోషించడ మనే బరువును మోస్తూ, విషయసుఖాలనే నీళ్ళలో మునిగి లేస్తూ,నావ లేకుండా నానా యాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడు (శ్రీమహా విష్ణువు) అనే నావ ఒక్కటే శరణ్యము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*14 వ శ్లోకం*

భవజలధిం అగాధం దుస్తరం నిస్తరేయం
కధమహమితి చేతో మాస్మగా: కాతరత్వం
సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా
నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యం

*భావం*

దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారుపడకు. శ్రీహరి పాద పద్మాలమీద స్థిరమైన భక్తిని అలవరచుకుంటే ఆ భక్తి ఒక్కటే నరక యాతనల నుంచి, సంసార సాగరం నుంచి రక్షిస్తుంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*15 వ శ్లోకం*

తృష్ణాతోయే మదన పవనోద్ధూతమోహోర్మిమాలే
దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ
సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్
పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ

*భావం*

( సంసారమను సముద్రము లోపడి, మునుగుచు, తెలుచూ, దాటలేక బాధపడుచున్న వారికి విష్ణువే నౌక అని, విష్ణుభక్తియే నౌక అని వెనుకటి 2 శ్లోకములలో పేర్కొని, ఆ నౌకను ఇవ్వమని విష్ణువునే ప్రార్థింపవలెనని తెలుసుకొని, ఈ శ్లోకంలో ప్రార్థించుచున్నారు.)

ఈ సంసారమను సముద్రము లో ఆశయే జలము. ఆ జలము కామమను పెనుగాలి చే కదిలింపబడుచున్నది. ఆ విధంగా కదులుటచే మొహమ ను కెరటములు వరుసగా సాగుచుండును. ఈ సముద్రములో భార్య సుడి గుండమువలె పట్టి తిప్పి, అందు పడినవారిని బయటకు పోనీయక ముంచివేయును. బిడ్డలు, బంధువులు -మొసళ్ళు మొదలగు జంతువులవలె కబళింప ప్రయత్నించుచుందురు. ఇట్లు భయంకరమగు సంసార మహా సముద్రమున పడి, దాటు ఉపాయము లేక మునుగు చున్న మాకు, ఓ వరద! ఓ త్రిధామ! నీ పాదపద్మభక్తి అనెడి నౌకను ఇచ్చి దరిజేర్చుమయ్యా.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*16 వ శ్లోకం*

పృధ్వీ రేణురణు: పయాంసి కణికా: ఫల్గుస్ఫులింగోనల:
తేజో ని:శ్వసనం మరుత్ తనుతరం రంధ్రం సుసూక్ష్మం నభ:
క్షుద్రా రుద్రపితామహ ప్రభృతయ:కీటాస్సమస్తాస్సురా:
దృష్టే యత్ర స తావకో విజయతేభూమావధూతావధి:

*భావం*

పరబ్రహ్మ స్వరూపమగు నారాయణుని దర్శించినచో అందు ఈ పృథ్వి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువు. ఈ జగము నీటి తుంపర. తేజస్సు సూక్ష్మమగు అగ్నికణము. వాయువు నిస్శ్వాసము. ఆకాశము సన్నని చిన్న రంధ్రము. రుద్రా పితామహాది దేవతాకోటి సమస్తము క్షుద్ర కీటకములు. ఆ పరబ్రహ్మమగు నారాయణుని అతిశయము అవధులు మీరి విరాజిల్లు చున్నది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*17 వ శ్లోకం*

హేలోకాశ్శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సా మిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయ:
అంతర్జ్యోతి రమేయ మేక మమృతం కృష్ణాఖ్య మాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణ మాత్యంతికంll

*భావం*

ముందటి రెండు శ్లోకములలో ఔషదం తెలియక బాధ పడుచున్న సంసార వ్యాధిగ్రస్తు లకు, కులశేఖరులు తాను తెలుసుకున్న చికిత్సను వివరించుచున్నారు.

ఓ లోకులారా! చావు పుట్టుకలను వ్యాధికి యోగమెరింగిన యాజ్ఞవల్క్యాదులగు మునులు కనిపెట్టిన ఈ చికిత్సను వినుడు, వారు కనుగొనిన దివ్యౌషదం “కృష్ణామృతము”. దానిని సేవించినచో ఈ వ్యాధి శాశ్వతముగా తొలగిపోవును. ఆ ఔషదం ప్రకాశవంతము, అద్వితీయము, ఇట్టిదని చెప్పనలవికానిదియునై వెలయు చుండును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*18 వ శ్లోకం*

హే మర్త్యా:! పరమం హిత శృణుత వో వక్ష్యామి సంక్షేపత:
సంసారార్ణవ మాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా:!
నానాజ్ఞాన మపాస్య చేతసి నమో నారాయణాయే త్యముం
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహు: !!

*భావం*

మర్త్యులు అమృతత్వము పొందుటకు ఉపాయము ఇందు ఉపదేశిస్తున్నారు. ఉపాయములు కర్మజ్ఞాన భక్తి యొగములుగా పేర్కొనబడి నవి ఎన్నియో ఉన్నవి. కాని అవి ప్రయాస సాధ్యము లని సంక్షేపముగ ఒక ఉపాయము ను ఉపదేశించుచున్నారు.

ఆపదలనెడి కెరటములతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చియున్న ఓ మర్త్యులారా! వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపాయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింత నములను విడచి మనసున “ఓం నమో నారాయణాయ” అను ఈ మంత్రమును జపించండి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*19 వ శ్లోకం*

నాథే న: పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతారి సురే నారాయణే తిష్ఠతి
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయం!!

*భావం*

ప్రభూ! మాకు నాథుడు, పురుషోత్తముడు, మూడు లోకముల ఏకైకనాథుడు, మనసు మాత్రము చేత సేవింపజాలినవాడు, సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, దేవతామూర్తి అగు నారాయణు డుండగా, మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామము లకో అధిపతి అగు వానిని, అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, ఒక మానవమాత్రుని సేవించుటకై తహతహలాడుచున్నాము. అహో! ఏమి మా జాడ్యము! నారాయణుని సేవింపక, నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పష్టముగా వివరించినారు.

నారాయణుడు సర్వ నర సమూహమునకు ఆశ్రయుడై, సర్వ నరులలో అంతర్యామి యై ఉండు వాడు. అతడు లేనిదే నిలకడలేనివాడు ఈ నరుడు. నారాయణుడు మనకు ప్రభువు. ఆ సంబంధ ము మనము తొలగించుకొందు మన్నను తొలగునది కాదు. నరునకు నరునితో సంబంధ ము కల్పితము. అతడు త్రిజగన్నాథుడు. ఇతడు కొలది గ్రామములకు అధినేత. వానిని మనసుతో సేవించిన చాలును. వీనికి శరీరమును కష్టపెట్టి ఊడిగము చేయవలెను. నారాయణుడు తనని కొలిచిన వారికి తన పదమునే ఇచ్చును. ఈ నరుడల్పాల్ప ములను ఈడేర్చును. అతడు పురుషోత్తముడు, వీడు పురుషాధముడు. అతడు దివ్యుడు, ఇతడు మర్త్యుడు. ఇంత బేధము న్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ము లమగు మా సంగతి ఏమను కోవలెనో తెలియదు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*20 వ శ్లోకం*

బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైస్సరోమోద్గమై:
కంఠేన స్వరగద్గదేన నయనే నోద్గీర్ణ బాష్పాంబునా
నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృయా స్వాదినాం
అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం

*భావం*

ఓ పుండరీకాక్షా! మేము ఎల్లప్పుడూ మనస్సుతో నీ పాదారవిందాలను ధ్యానిస్తూ, ఆనందం అనుభవిస్తూ, చేతులు జోడించి,శిరస్సు వంచి నమస్కారం చేసేటట్లును, కంఠం గద్గదమయ్యేట ట్లును, శరీరం పులకాంకితమై ఉండేటట్లును, కన్నులు ఆనందభాష్పాలతో నిండేటట్లును, మేము జీవించి ఉన్నంత కాలం ఎడతెగక ఇలానే జరిగేటట్లుగా అనుగ్రహించాలనిప్రార్థిస్తున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*21 వ శ్లోకం*

జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణి ద్వంద్వ సమర్చ యాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరే ర్గచ్చాంఘ్రి యుగ్మాలయం
జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్ నమాధోక్షజంll

*భావం*

ఇంద్రియ నిగ్రహం రెండు రకాలు. చేయకూడని వాని నుండి మరలించుట, చేయ వలసిన వానిని చేయుట.
ఈ శ్లోకమందు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనస్సులచే చేయదగిన వానిని చెప్పుచున్నారు.

ఓ పాద ద్వంద్వమా! నీవు భగవదాలయమునకు నడుచుచుండుము. ఓ హస్త ద్వంద్వమా! నీవు భగవ దర్చన చేయుచుండుము. ఓ వాగింద్రియమా! నీవు కేశవుని కీర్తింపుచుండుము. ఓ శిరమా! నీవు భగవంతుని నమస్కరిం చుచుండుము.
ఇట్లు కర్మేంద్రి యములను నిగ్రహింప వలెను

ఓ నేత్రద్వంద్వమా! శ్రీకృష్ణభగవానునే చూడుము. ఓ శ్రోత్రద్వంద్వమా! ఆ శ్రీకృష్ణు ని లీలలనే ఆకర్శింపుము. ఓ నాసికా ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు (ఇట్లు జ్ఞానేంద్రియములను నిగ్రహింపవలెను.) ఓ మనసా! ఆ శ్రీధరునే ధ్యానింపుము.(ఈవిధంగా మనస్సును నిగ్రహింపవలెను)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*22 వ శ్లోకం*

ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం వేదవ్రతాన్యన్వహం
మేదశ్చేదఫలాని పూర్తవిధయ: సర్వే హంతం భస్మని
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వాంభోరుహసంస్మృతీ: విజయతే దేవస్య నారాయణ:

*భావం*

భగవంతుడైన శ్రీమన్నారాయ ణుని పాదపద్మాలపై స్మరణ లేకపోతే ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు.ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు. పుణ్యకర్మలు చేసినా ఫలిత ముండదు, పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమ మవు తుంది. ఏనుగు స్నానానంత రం తన దేహం మీద మట్టిని పోసుకున్నట్లు దైవచింతనలేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*23 వ శ్లోకం*

మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుంద పదారవింద ధామ్ని
హరనయన కృశానునాకృశోసి
స్మరసి న చక్రపరాక్రమం మురారే:।।

*భావం*

ఓ మన్మథుడా! భగవంతుని పాదారవిందాలను ధ్యానించు నా మనస్సులో మోహం కలిగించకు. హరుని కంటి మంటలకన్నా తీక్షణమైన నారాయణుని సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ వెరుగకు న్నావేమో!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*24 వ శ్లోకం*

మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే
మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యా నన్యదాఖ్యానజాతం
మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యా వ్యతికర రహితో జన్మ జన్మాంతరేపి

*భావం*

(భక్తినొసంగమని ప్రార్థించి, కులశేఖరులు ఆ భక్తి కలుగుటకు ప్రతిబంధకముగా ఉండు పాపముల ను తొలగించుటకై, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ మనస్సులచే సాధింపదగు శమ దమాది సంపత్తిని ఇందు వివరించుచున్నారు.)

హే జగన్నాథా! మాధవ! నీ పాదారవిందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనుల ను కంటితో చూడను. చేవికింపైన బంధము కలదయినను చరిత్రము తప్ప వేరొక కథాసందర్భ మును చెవితో వినను. (ఈ రెండింటిచేత జ్ఞానేంద్రియ నిగ్రహమును సూచించిరి.)

మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను (అసత్పురుషులను) నేను స్మరింపను. (దీనిచే మనో నిగ్రహము సూచింపబడినది.)

జన్మజన్మాంతరములందును నీ కైంకర్యములేని మనుగడను కలిగియుండును.
(దీనిచే కర్మేంద్రియ నిగ్రహము సూచింపబడినది.)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*25 వ శ్లోకం*

మజ్జన్మన: ఫలమిదం మధుకైటభారే
మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ!
త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ!

*భావం*

హే మధుకైటభ మర్దనా! నేను ఎలాంటి యోగ్యతా లేనివాణ్ణి కాబట్టి నీ పాదసేవ చేయటాని కి అనర్హుడనయ్యాను.కానీ నీ సేవక వర్గంలో నన్ను కట్టకడపటివానిగానైనా
(దాసానుదాసానుదాసాను దాసునిగా) నియమించు.ఈ మాత్రం దయ చూపించు. ఈ జన్మ ఎత్తినందుకు ఇదే సాఫల్యం
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*26 వ శ్లోకం*

తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరంతీవ సతాం ఫలాని
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి

*భావం*

ఓ జిహ్వా! దోసిలియొగ్గి ప్రార్థించుచున్నాను. పరతత్వ మగు నారాయణుని ప్రతిపా దించుచు, సత్పురుషులకు అమృతమును స్రవించు ఫలముల వంటివైన ఆయన నామములను మరల మరల ఉచ్చరింపుము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*27 వ శ్లోకం*

నమామి నారాయణ పాదపంకజం
కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం
స్మరామి నారాయణ తత్త్వమవ్యయం

*భావం*

శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును. నారాయణుని సదా పూజింతును. నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును. శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*28 వ శ్లోకం*

శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే
శ్రీపద్మనాభాచ్యుతకైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ
గోవింద దామోదర మాధవేతి
వక్తుం సమర్థోపిన వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యం

*భావం*

శ్రీనాథ! నారాయణ! వాసుదేవ! శ్రీకృష్ణ! భక్తప్రియ! చక్రపాణి! శ్రీపద్మనాభ! అచ్యుత! కైటభారీ! శ్రీరామ! పద్మాక్ష! హరీ! మురారీ! అనంత! వైకుంఠ! ముకుంద! కృష్ణ! గోవింద! దామోదర! మాధవ! అని పలుకగలిగిన మనుజుడు కూడా పలుకుట లేదు. అయ్యో! ఈ వ్యాసాన లంపట త్వమెంతటిది!

అనంత వైకుంఠ ముకుంద కృష్ణ!గోవిందా!దామోదరా!మాధవా!ఇలా భగవంతుని పవిత్ర నామాల ను ఉచ్చరించటానికి మానవులకు సామర్థ్యమున్నా మానవు లెవ్వరూ అలా ఉచ్చరించ లేకుండా పోవటం ఎంత దురదృష్టకరం.కేవలం స్మరణ మాత్రమున అభీష్టఫలాలు ప్రసాదించే భగవన్నామా న్ని విస్మరించి జనులు క్లేశకరము లైన కార్యాలలో ఆసక్తులై, జూదం మొదలగు వ్యసనాల తో కాలం గడుపుతూ ఉండటం ఎంతో శోచనీయం.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*29 వ శ్లోకం*

భక్తాపాయభుజంగగారుడమణి: త్త్రైలోక్యరక్షామణి:
గోపీలోచన చాతకామ్బుద మణి స్సౌందర్యముద్రామణి:!
య: కాన్తామణి రుక్మిణీ ఘన కుచ ద్వన్ద్వైకభూషామణి:
రేయో దేవ శిఖామణి ర్దిశతు నో గోపాలచూడామణి: !!

*భావం*

సంసార వ్యాధిగ్రస్థులకు ఆ వ్యాధి నివారణకు మణిమంత్రఔషధములను ఉపదేశించుచున్నారు. దేవతాశిఖామణి గోపాలచూడామణి మనకు శ్రేయస్సు ఒసంగుగాక! దేవతాంతరముల కంటె గోపాలుడగు శ్రీకృష్ణదేవుడు శ్రేయస్సులు ఒసంగుటలో సులభుడు. అతడు కాంతామణి అగు రుక్మిణీదేవి కుచద్వంద్వమునకు అనన్య సాధారణమగు భూషణమణి. సాక్షాత్ లక్ష్మియే రుక్మిణి. వారిద్దరూ మణి, మణిప్రభలవలె ఒకరినొకరు విడువకుందురు. అందుచే ఆ రుక్మిణీ మనోవల్లభుడే మనకు శ్రేయఃప్రదుడు. ఆ విధంగా ఆమెకు అలంకారముగా ఉండుటచే అతడు సౌందర్యముద్రామ ణి. లోకములో ఇది అందమైన వస్తువని నిరూపించుటకు ఆ కృష్ణసౌందర్యము ముద్ర పడవలెను. ఆ అందమును చూసి పరవశులై గోపికలు తమ లోచన చాతకములచే ఆ కృష్ణమేఘమునే సేవించుచుందురు. ఈ మేఘము కేవలము చాతకములనే కాదు, మూడులోకములను తన కృపాశక్తిచే రక్షించుమణి. ఈ రక్షామణి మూడులోకములను రక్షించునదియే ఐనను భక్తుల పట్ల గారుడ, మణియై వారికీ కలుగు అపాయములనెడి భుజంగములను(పాములను) దరిచేరకుండ తొలగించును.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*30 వ శ్లోకం*

శతృచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్య మంత్రం
సంసారోత్తారమంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం
సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్య మంత్రం

*భావం*

ఓ జిహ్వా! (ఓ నాలుకా!!) శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము. అదియే జన్మకు సాఫల్యము ఇచ్చునది. కామాది శత్రువులను భేదించుటలో ప్రధాన సాధనం ఆ మంత్రము. సర్వోపనిషద్ వాక్యములు ఆ మంత్రమునే పూజించినవి. జననమరణము లనెడి సంసారము నుండి తరింపచే యగల మంత్రమది. రాశీభూతమైన అవిద్యాంధ కారమును నశింపజేయు మంత్రము. ఆ మంత్ర మే సర్వైశ్వర్యములను ఇచ్చెడిది. వ్యసనములనెడి సర్పములు కాటువేసినప్పుడు కాపాడగల మంత్రము. కనుక శ్రీకృష్ణ మంత్రమును సర్వదా జపింపుము.!!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*31 వ శ్లోకం*

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం
దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధం
భక్తాత్యంతహితౌషధం భవభయప్రధ్వంసనైకౌషధం
శ్రేయ: ప్రాప్తికరౌషధం పిబ మన:శ్రీకృష్ణదివ్యౌషధం

*భావం :-*

వ్యామోహాన్ని శమింపజేసే ఔషధము, మనోవృత్తులను నశింపచేసి స్థిమితాన్ని చేకూర్చే ఔషధము,రాక్షసులనే ఘోర వ్యాధులను తెగటార్చే ఔషధము, సంజీవిని అనే ఔషధంలా ముల్లోకాలను ఉజ్జీవింపచేసే ఔషధము, భక్తులకు అత్యంత హితాన్ని చేకూర్చే ఔషధము, సంసారమనే భయమును ధ్వంసం చేసే ఔషధము, శ్రేయస్సును ప్రసాదించే ఔషధము అయిన ‘శ్రీకృష్ణనామ’మనే దివ్యౌషధాన్ని ఓ మనసా!నీవు పానం చేయి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*32 వ శ్లోకం*

కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్వ్యైవ మే విశతు మానస రాజహంస:
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై:
కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే

*భావం :-*

కృష్ణా! మరణ సమయమున నిన్ను స్మరింతునని అంటిని కానీ, ఆవేళ కఫవాత పైత్యము లచే కంఠము మూతపడినప్పు డు నీ స్మరణ కలుగునో కలుగదో కదా! కావున ఇప్పుడే నా మానస రాజహంసము విరోధులెవ్వరూ చేరలేని వజ్ర పంజరము వలె ఉండు నీ పాదపద్మ మధ్యమున చేరుగాక!
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*33 వ శ్లోకం*

ఇదం శరీరం పరిణామపేశలం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ

*భావం :-*

ఓ మూఢుడా! దుర్మతీ! ఈ శరీరము అనేక సంధులు కలిగి స్వాభావికంగా దుర్భలమైంది. వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్భలమౌతుంది. వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృశించి నశించక తప్పదు. దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు లేకుండటానికి ‘శ్రీకృష్ణనామ’ మనే ఉత్తమ ఔషధాన్ని పానం చేయి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*34 వ శ్లోకం*

కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం

*భావం :-*

(ఈ శ్లోకమున చమత్కారముగ విభక్తులన్నిటిలోను అనగా ప్రథమా విభక్తి మొదలు సప్తమి విభక్తి వరకును, సంబోధన ప్రథమావిభక్తితో సహా కృష్ణ శబ్దమును నిర్దేశించి స్తుతించుచున్నారు.)

కృష్ణుడు జగత్రయ గురువు. మమ్ములను రక్షించుగాక! కృష్ణుని నేను నమస్కరించు చున్నాను. కృష్ణుని చేత రాక్షసులు చంపబడిరి. కృష్ణుని కొరకు నమస్కరించు చున్నాను. కృష్ణుని నుండి ఈ జగత్తు బయటపడినది. కృష్ణునకు నేను దాసుడను. కృష్ణుని యందే ఈ సర్వజగత్తు నిలిచియున్నది. ఓ కృష్ణా! నన్ను రక్షింపుము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*35 వ శ్లోకం*

హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే
హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ
హే రామానుజ హే జగత్త్రయ గురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా

*భావం :-*

ఓ గోపాలా! దయాసాగరా! లక్ష్మీపతే! కంసుని హతమార్చి న స్వామీ, గజేంద్రుని సంరక్షించిన మహాప్రభో, మాధవా,రామానుజా,త్రిలోకపూజిత గురువరేణ్యా, పద్మనేత్రుడా, గోపీజన వల్లభా! నన్ను రక్షించు. నిన్ను వినా నేను మరెవ్వరినీ ఎరుగను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*36 వ శ్లోకం*

దారా వారాకరవరసుతా తే తనూజో విరించి:
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గ: ప్రసాద:
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీతే
మాతా మిత్రం వలరిపు సుతస్త్వయ్యతోన్యన్న జానే

*భావం :-*

కృష్ణా! జలనిధి (సముద్రుని) పుత్రికయగు లక్ష్మి నీ భార్య. బ్రహ్మ నీ కుమారుడు. వేదము (వేద పురుషుడు) నిన్ను స్తోత్రం చేసే పాఠకుడు. దేవతాగణము నీ భ్రుత్యకోటి. మోక్షము నీ అనుగ్రహము. ఈ జగత్తు నీమాయ. దేవకీదేవి నీ తల్లి. ఇంద్రపుత్రుడగు అర్జునుడు నీ మిత్రుడు. అట్టి నీకంటే ఇతర దైవమును ఎవరిని నేను ఎరుగను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*37 వ శ్లోకం*

శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కే న ప్రాపు ర్వాంచితం పాపినోపి
హా న: పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాదిదు:ఖం

*భావం :-*

ఎంత పాపం చేసిన వారైనప్పటికీ ‘నారాయణ’అనే పవిత్రనామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు. అయ్యో!! నేను పూర్వం నా నోట ఆ నారాయణ మంత్రాన్ని ఉచ్ఛరించక పోయినందు వల్లనే నాకీ జన్మము మరియు ఈ గర్భవాస దుఃఖం ప్రాప్తించింది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*38 వ శ్లోకం*

ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం
సమాహితానాం సతతా భయప్రదం
తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం

*భావం :-*

అనంతుడు,అవ్యయుడు,హృదయ పద్మములో సదా వెలసి ఉండేవాడు, స్థిరచిత్తులై ఉండే వారికి ఎల్లప్పుడూ అభయమిచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువుని ఎవరు సదా ధ్యానం చేస్తారో వారికి ఆ భగవదనుగ్రహం వల్ల సకలాభీష్టసిద్ధి కలుగుతుంది మరియు విష్ణు సంబంధ మనెడి పరమసిద్ధిని పొందుదురు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*38 వ శ్లోకం*

తత్త్వం ప్రసీద భగవన్ కురు మయ్యనాథే
విష్ణో కృపాం పరమకారుణిక: కిల త్వం
సంసారసాగరనిమగ్నమనంత దీనం
ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి

*భావం :-*

స్వామీ!అనంతమైన సంసారసాగరంలో మునిగి బాధపడుతున్న ఈ దీనుని కటాక్షించుము. పరమ కారుణ్యమూర్తివైన నీవు తప్ప నన్ను మరెవ్వరూ రక్షింపలేరని నిన్నే నమ్మి ఉన్నాను. పురుషోత్తముడివైన నీవే నన్ను ఆదుకోవాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*39 వ శ్లోకం*

క్షీరసాగర తరంగశీకరా-
సారతారకిత చారుమూర్తయే
భోగిభోగ శయనీయశాయినే
మాధవాయ మధువిద్విషే నమ:

*భావం :-*

క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు, శేషభోగ శయ్యపై పవళించిన మధుసూదనుడగు మాధవునికి నమస్కారము.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*కులశేఖర్ ఆళ్వారు విరచిత ముకుందమాల*
*40 వ శ్లోకం*

యస్య ప్రియౌ శ్రుతిధరౌ కవిలోకవీరౌ
మిత్రే ద్విజన్మవరపద్మ శరావభూతామ్!
తేనామ్భుజాక్ష చరణామ్బుజ షట్పదేన
రాజ్ఞా కృతా కృతిరియం కులశేఖరేణ!!

*భావం :-*

వేదవిద్యా ప్రతిష్ఠాపకులు, కవిలోక వీరులు అగు “ద్విజన్మ పద్మశరులు” ఎవరికీ మిత్రులై ఉండిరో, ఆ పుండరీకాక్ష పదాంబుజ భ్రుంగమగు కులశేఖర మహారాజు ఈ కృతిని నిర్మించెను.

కులశేఖరునకు ద్విజన్మవర, పద్మశరులను ఇద్దరు మిత్రులుండిరి. ఆ ద్విజన్మ వరుడు వ్యాసుడో, వాల్మీకియో అయి ఉండివలెననియు, పద్మశరుడు శఠగోపులనెడి ఆళ్వారు (నమ్మాళ్వారు) అని యు పెద్దలు చెప్పుచుందురు. అందు కవిలోక వీరుడనుటచే ఆదికవియగు వాల్మీకియే ద్విజన్మ వరుడని, ఆయన శ్రీరామాయణమున వేదోపబృంహణము (బృహత్తరము) చేయుటచే శృతిధరు డు అనియు చెప్పవచ్చును. తమిళమున, సంస్కృతమున ప్రసిద్ధులగు కవులలో శఠగోప, వాల్మీకులు ఆద్యులు కనుక వారినే ఇక్కడ పెర్కొనెనని చెప్పవచ్చును. శఠగోపునకు “మారన్” అని తమిళ నామము. మారుడన గా మన్మథుడు కనుక దానికి సంస్కృత పర్యాయమగు పద్మశరుడు అని ఇందులో ప్రయోగింపబడినది.

।। ఇతి ముకుందమాల స్తోత్రం సంపూర్ణం ।।

Health-Wealth-Knowledge









Thursday, July 9, 2020

Architecture of Oracle 11g : Part 2


The second part of the memory structure of the Oracle architecture which is known as PGA (Program Global Area)

PGA: This area is always controlled by main process for which it's spun. To elaborate further, it's the memory allocated to every server process or the background process running in the memory. The configuration of the PGA changes with the dedicated server and shared server architecture. In shared server architecture the sort area is in SGA while in dedicated server the area is in PGA. Furthermore, PGA helps to localize the memory location to the dedicated User; the SQL statements executed by the user use this memory space. PGA has one to one relations with processes. 

The PGA memory structure can be classified as below:

1) SQL Area:
The area is allocated to SQL variables bind information and runtime memory structure. Every user creates its own session on Oracle server which has its own SQL area.

 In-Execution Area: 
This area is used to keep user session information whenever the user does DML operations like SELECT, INSERT, DELETE or UPDATE.  Garbage collection of In- Execution area is done as soon the output of the above queries is received. Also, the SQL statements using JOINS or GROUP BY or ORDER BY clauses use this area for sorting purpose.
OPEN_CURSOR parameter initializes the number of cursors in the session to handle SQL areas in memory. By now we know that all sorting operations are performed in the PGA cache memory, and this mode of operations is called as optimal operation mode, as it prevents disk I/O too. Further, if the memory area is not appropriately configured the SQL end up using disk in limited fashion, such operations are single pass operations. Thus, for an efficient execution of the query the memory size should be appropriated to the size of SQL queries like in OLTP the SQL statements are not data intensive, while in OLAP the queries are executed on large data to generate reports including sorting on huge dataset. 

Managing PGA size:
The PGA size can be automatically managed by setting WORKAREA_SIZE_POLICY initialization parameter to auto. We are also required to manually configure SORT_AREA_SIZE, HASH_AREA_SIZE and BITMAP_AREA_SIZE parameters to get adequate sort performance. Further, if we want to automate the memory allocation to PGA process that is, let oracle decide what is best for the users then we need only to initialize PGA_AGGREGATE_TARGET parameter. 

Now let us discuss the second major part of oracle architecture i.e "LOGICAL STRUCTURE".

The Logical structure of the Oracle database is hierarchal in nature.


1) Data Block: This is the most basic part of the logical composition of the database. It contains specified number of bytes on the disk. DB_BLOCK_SIZE parameter initializes the size of the data block, which can range from 2KB to 32 KB. For a good performance we should size data block as multiple of OS level data block size. The main role of oracle data block comes in block recovery via RMAN, this happens in the scenario when there is block corruption due to some hardware, i/o, oracle or OS level reasons, then we create block dump to see the data present in the data block which done by the process of binary dumping. ALTER SYSTEM commands can be used to create data block dump files

2) Extents:  It is a combination of two or more data blocks. Please remember these data blocks are in consecutive manner. This is also a unit of space allocation. We can understand it better with example: If we create a table we can specify the initial storage space to be allocated in extents and also gives its next extent range to a max range.

CREATE TABLE emp 
(emp_no     NUMBER(2), 
 emp_name   VARCHAR2(14), 
 location   VARCHAR2(13) ) 
 STORAGE  ( INITIAL 100K  NEXT     50K 
            MAXEXTENTS 50 );

3) Segments: It is a collection of extents which is allocated for use in structures like index or table or so. Thus, the space allocated to above created EMP table will be called as the EMP table segments. Similarly, the other data objects like sort segments, undo segments etc.; will have the segments name same as the object name. 

4) Table space: This is formed by allocation of similar segments. It contains one or more data files and all objects are inside the table space. These data files are oracle formatted OS files. It is advised that related tables be kept in the same table space. Space management can be done by adding new data files if the space is full, else it is managed automatically by the oracle. Below are the default table space create while installing the Oracle DB

a) SYSAUX table space 

b) System table space 

c) Temporary table space 

d) Undo table space

e) Default table space

Advantage of using table space:

I. It helps in easy recovery and backups as it acts as a unit.

II. It`s easy to allocate space.

III. We can offline a particular table space without bringing down the entire table space.

IV. Table space helps increase performance as we can use data files which resets on different disks, further controlling the I/O on the disks.

V. Also we can use import/export utility at table space level.

And finally the third part which is "PHYSICAL DATABASE STRUCTURE": 

In this I am going to share about how the oracle database files are kept in the OS level. The physical data structure mainly consists of three types of files:

1) Data files: 
The data files as discussed above are used to store logical entity like Table space. The data files can be part of one or more data base or entirely belong to one database. These data files store all the tables, indexes on the physical files. If there is a read or write then there is I/O operation for the disks where the data files are saved. Oracle managed Files (OMF) which was introduced in Oracle8i has automated the management of the Operating System file. We need not mention data file names while performing operations on data objects. In oracle we can map a table space to a data files but we cannot map table or data inside a table space to a data files directly.

2) Control files: 
This is the most vital file of Oracle Database, without this file database cannot function or even be brought up. It contains the recent state information of the database, and because of this it is maintained in multiplexed form, generally three copies. The control file consists of the information about the names and locations of the data files, backup set details, redo log files,  current log sequence numbers and the all- significant system change number (SCN), which indicates the most recent version of committed changes in the database information that is restricted form the users even for reading purposes. The changes in the control file are made by oracle processes only, which again is replicated in all the copies of the Control file. When we bring up the Oracle database in mount state it reads the control file to make itself aware of the database status and where about of its configuration and data files. V$CONTROLFILE is the dynamic view which provides us information about the control files. The control files end with .ctl extension.

3) Redo log Files:      
The redo log files actually records everything (DML operations) happening on the database. These are used for recovery and backups also. Whenever there are changes made to the data and committed its first recorded in the redo log files even before its being updated on the data files, thus we can recover the latest changes made from the redo log files as part of recovery process. The set of redo log files that are currently being used are called online redo log file and these files are flushed to be archived and kept for recovery, these are offline files called archived redo log files. Redo log buffer area keeps the online redo log files. Further it is recommended to multiplex the redo log files because of its importance in database recovery.

4) Other important files which includes below files:

I. SPFILE: It is called server parameter files. It is the first file that is read while bringing up the database. This file contains information about the initialization parameters like memory limit, setting to determine the database configuration, archived log location and most important the CONTROL FILE location. This file is stored on the Oracle server, though the directories may differ in different Operating System. We can use V$SPPARAMETER dynamic view to get the information of the SP file.

II. Password File: This file contains the information about the SYSDBA and SYSOPER administrative privilege user, as it helps them to perform startup, shutdown, backup and recovery of database.

III.  Alert log file: This is a mandatory file of oracle database its nomenclature is alterdb_name.log where db_name is the name of the database. It captures all the major database incidents like errors related to oracle, warnings or other messages, sequence of startup, parameters of initialization, track table space regarding the addition or removal of data files. The alert log location cab be viewed by BACKGROUND_DUMP_DEST parameter. Alert log is the first step towards diagnosing an error.

IV. Trace Files: If any background process like DB Writer, Log Writer, others fail or any user process fails, these trace files help to diagnose the error. DIAGNOSE_DEST is the initialization parameter to know the destination of the trace files. These files have extension of .trc.

Backup Files: Backup files help us to recover and restore database to its present form. These backup files could be self-initiated or created via using RMAN back-up tool.