Wednesday, July 20, 2022

Srimadramayanam 13th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  13 వ సర్గము

దశరథుడు పత్నీసమేతుడై యజ్ఞదీక్ష గ్రహించుట


పున: ప్రాప్తే వసన్తే తు పూర్ణస్సంవత్సరో.?భవత్.
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్..1.13.1..

అభివాద్య వసిష్ఠం చ న్యాయత: పరిపూజ్య చ.
అబ్రవీత్ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్..1.13.2..

యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్యథోక్తం మునిపుఙ్గవ!.
యథా న విఘ్న: క్రియతే యజ్ఞాఙ్గేషు విధీయతామ్..1.13.3..

భవాన్ స్నిగ్ధస్సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్.
ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత:..1.13.4..

తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః.
కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్..1.13.5..

తతో.?బ్రవీద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్.
స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్పరమధార్మికాన్..1.13.6..
కర్మాన్తికాన్ శిల్పకరాన్వర్ధకీన్ ఖనకానపి.
గణకాన్శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్..1.13.7..
తథా శుచీన్శాస్త్రవిద: పురుషాన్ సుబహుశ్రుతాన్.
యజ్ఞకర్మ సమీహన్తాం భవన్తో రాజశాసనాత్..1.13.8..
ఇష్టకా బహు సాహస్రాశ్శీఘ్రమానీయతామితి. 0
ఉపకార్యా: క్రియన్తాం చ రాజ్ఞాం బహుగుణాన్వితా:..1.13.9..

బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాశ్శతశశ్శుభా:.
భక్ష్యాన్నపానైర్బహుభిస్సముపేతాస్సునిష్ఠితా:..1.13.10..

తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరా:.
ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితా:..1.13.11..0-

తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్.
దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా..1.13.12..

సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతా:.
న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి..1.13.13..

యజ్ఞకర్మసు యే వ్యగ్రా: పురుషాశ్శిల్పినస్తథా.
తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్..1.13.14..
తే చ స్యుస్సమ్భృతాస్సర్వే వసుభిర్భోజనేన చ.

యథా సర్వం సువిహితం న కిఞ్చిత్పరిహీయతే..1.13.15..
తథా భవన్త: కుర్వన్తు ప్రీతిస్నిగ్ధేన చేతసా.

తతస్సర్వే సమాగమ్య వసిష్ఠమిదమబ్రువన్..1.13.16..
యథోక్తం తత్సువిహితం న కిఞ్చిత్పరిహీయతే.
యథోక్తం తత్కరిష్యామో న కిఞ్చిత్పరిహాస్యతే..1.13.17..

తతస్సుమన్త్రమానీయ వసిష్ఠో వాక్యమబ్రవీత్.
నిమన్త్రయస్వ నృపతీన్పృథివ్యాం యే చ ధార్మికా:..1.13.18..

బ్రాహ్మణాన్క్షత్రియాన్వైశ్యాఞ్ఛూద్రాంశ్చైవ సహస్రశ:.
సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్..1.13.19..

మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్.
నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్..1.13.20..
తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్.
పూర్వసమ్బన్ధినం జ్ఞాత్వా తత: పూర్వం బ్రవీమి తే..1.13.21..

తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్.
వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ హ..1.13.22..

తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్.
శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ..1.13.23..

అఙ్గేశ్వరమ్ మహాభాగం రోమపాదం సుసత్కృతమ్.
వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్..1.13.24..

ప్రాచీనాన్సిన్ధు సౌవీరాన్సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్.
దాక్షిణాత్యాన్నరేన్ద్రాంశ్చ సమస్తానానయస్వ హ..1.13.25..

సన్తి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజాన: పృథివీతలే.
తానానయ యథాక్షిప్రం సానుగాన్సహ బాన్ధవాన్..1.13.26..

వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమన్త్రస్త్వరితస్తదా.
వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్..1.13.27..

స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్.
సుమన్త్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షిత:..1.13.28..

తే చ కర్మాన్తికాస్సర్వే వసిష్ఠాయ చ ధీమతే.
సర్వం నివేదయన్తి స్మ యజ్ఞే యదుపకల్పితమ్..1.13.29..

తత:ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్ సర్వానిదమబ్రవీత్ .
అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయా.?పి వా..1.13.30..
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయ:. 28

తత: కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షిత:..1.13.31..
బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై.

తతో వసిష్ఠస్సుప్రీతో రాజానమిదమబ్రవీత్..1.13.32..
ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్.
మయాపి సత్కృతా: సర్వే యథార్హం రాజసత్తమా:..1.13.33..

యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైస్సుసమాహితై:.
నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమన్తికాత్..1.13.34..

సర్వకామైరుపహృతైరుపేతం చ సమన్తత:.
ద్రష్టుమర్హసి రాజేన్ద్ర మనసేవ వినిర్మితమ్..1.13.35..

తథా వసిష్ఠవచనాదృశ్యశృఙ్గస్య చోభయో:.
శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతి:..1.13.36..

తతో వసిష్ఠప్రముఖాస్సర్వ ఏవ ద్విజోత్తమా:.
ఋశ్యశృఙ్గం పురస్కృత్య యజ్ఞకర్మారభన్ తదా..1.13.37..
యజ్ఞవాటగతాస్సర్వే యథాశాస్త్రం యథావిధి. 3

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే త్రయోదశస్సర్గ:





Tuesday, July 19, 2022

Srimadramayanam 12th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  12 వ సర్గము
 
యాగమును చేయింపుడని దశరథుడు ఋషులను కోరుట.

తత: కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే.
వసన్తే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనో.?భవత్..1.12.1..

తత: ప్రసాద్య శిరసా తం విప్రం దేవవర్ణినమ్.
యజ్ఞాయ వరయామాస సన్తానార్థం కులస్య వై..1.12.2..

తథేతి చ స రాజానమువాచ చ సుసత్కృత:.
సమ్భారా సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్..1.12.3..

తతో రాజా.?బ్రవీద్వాక్యం సుమన్త్రం మన్త్రిసత్తమమ్.
సుమన్త్రావాహయ క్షిప్రం ఋత్విజో బ్రహ్మవాదిన:..1.12.4..
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్.
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమా:..1.12.5..

తతస్సుమన్త్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమ:.
సమానయత్స తాన్విప్రాన్ సమస్తాన్వేదపారగాన్..1.12.6..

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా.
ధర్మార్థసహితం యుక్తం శ్లక్ష్ణం వచనమబ్రవీత్..1.12.7..

మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖమ్.
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ..1.12.8..

తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా.
ఋషిపుత్రప్రభావేన కామాన్ప్రాప్స్యామి చాప్యహమ్..1.12.9..

తతస్సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణా: ప్రత్యపూజయన్.
వసిష్ఠప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్..1.12.10..

ఋష్యశృఙ్గపురోగాశ్చ ప్రత్యూచుర్నృపతిం తదా.
సమ్భారాస్సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్..1.12.11..

సర్వథా ప్రాప్స్యసే పుత్రాంశ్చత్వారో.?మితవిక్రమాన్.
యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా ..1.12.12..

తత: ప్రీతో.?భవద్రాజా శ్రుత్వా తద్విజభాషితమ్.
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షేణేదం శుభాక్షరమ్..1.12.13..

గురూణాం వచనాచ్ఛీఘ్రం సమ్భారాస్సమ్భ్రియన్తు మే.
సమర్థాధిష్ఠితశ్చాశ్వస్సోపాధ్యాయో విముచ్యతామ్..1.12.14..

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్.
శాన్తయశ్చాభివర్ధన్తాం యథాకల్పం యథావిధి..1.12.15..

శక్య: ప్రాప్తుమయం యజ్ఞస్సర్వేణాపి మహీక్షితా.
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్క్రతుసత్తమే..1.12.16..

ఛిద్రం హి మృగయన్తే.?త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసా:.
నిహతస్య చ యజ్ఞస్య సద్య: కర్తా వినశ్యతి..1.12.17..

తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే.
తథా విధానం క్రియతాం సమర్థా: కరణేష్విహ..1.12.18..

తథేతి చ తతస్సర్వే మన్త్రిణ: ప్రత్యపూజయన్.
పార్థివేన్ద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తమకుర్వత..1.12.19..

తతో ద్విజాస్తే ధర్మజ్ఞమస్తువన్పార్థివర్షభమ్.
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతమ్..1.12.20..

గతేష్వథ ద్విజాగ్య్రేషు మన్త్రిణస్తాన్నరాధిప:.
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతి:..1.12.21..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ద్వాదశస్సర్గ:




Sunday, July 17, 2022

Srimadramayanam 11th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  11 వ సర్గము 

దశరథుడు శాంతాఋష్యశృంగులను అయోథ్యకు తీసుకొనివచ్చుట


భూయ ఏవ హి రాజేన్ద్ర! శృణు మే వచనం హితమ్.
యథా స దేవప్రవర: కథాయామేవమబ్రవీత్..1.11.1..

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మిక:.
రాజా దశరథో నామ్నా శ్రీమాన్సత్యప్రతిశ్రవ:..1.11.2..

అఙ్గరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి.
కన్యా చాస్య మహాభాగా శాన్తా నామ భవిష్యతి..1.11.3..

పుత్రస్తు సో.?ఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుత:.
తం స రాజా దశరథో గమిష్యతి మహాయశా:..1.11.4..

అనపత్యో.?స్మి ధర్మాత్మన్! శాన్తాభర్తా మమ క్రతుమ్.
ఆహరేత త్వయాజ్ఞప్తస్సన్తానార్థం కులస్య చ..1.11.5..

శ్రుత్వా రాజ్ఞో.?థ తద్వాక్యం మనసా స విచిన్త్య చ.
ప్రదాస్యతే పుత్రవన్తం శాన్తాభర్తారమాత్మవాన్..1.11.6..

ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వర:.
ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాన్తరాత్మనా..1.11.7..

తం చ రాజా దశరథో యష్టుకామ: కృతాఞ్జలి:.
ఋశ్యశృఙ్గం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్.. 1.11.8..
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వర:.
లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాంపతి:..1.11.9..

పుత్రాశ్చాస్య భవిష్యన్తి చత్వారో.?మితవిక్రమా:.
వంశప్రతిష్ఠానకరాస్సర్వలోకేషు విశ్రుతా:..1.11.10..

ఏవం స దేవప్రవర: పూర్వం కథితవాన్కథామ్.
సనత్కుమారో భగవాన్పురా దేవయుగే ప్రభు:..1.11.11..

స త్వం పురుషశార్దూల! తమానయ సుసత్కృతమ్.
స్వయమేవ మహారాజ! గత్వా సబలవాహన:..1.11.12..

అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ.
సాన్త:పురస్సహామాత్య: ప్రయయౌ యత్ర స ద్విజ:..1.11.13..

వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైశ్శనై:.
అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుఙ్గవ:..1.11.14..

ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్.
ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్..1.11.15..

తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషత:.
సఖిత్వాత్తస్య వై రాజ్ఞ: ప్రహృష్టేనాన్తరాత్మనా..1.11.16..

రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే.
సఖ్యం సమ్బన్ధకం చైవ తదా తం ప్రత్యపూజయత్..1.11.17..

ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభ:.
సప్తాష్టదివసాన్రాజా రాజానమిదమబ్రవీత్..1.11.18..

శాన్తా తవ సుతా రాజన్! సహ భర్త్రా విశాంపతే.
మదీయనగరం యాతు కార్యం హి మహదుద్యతమ్..1.11.19..

తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమత:.
ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా..1.11.20..

ఋషిపుత్ర: ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా.
స నృపేణాభ్యనుజ్ఞాత: ప్రయయౌ సహ భార్యయా..1.11.21..

తావన్యోన్యాఞ్జలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా.
ననన్దతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్..1.11.22..

తతస్సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునన్దన:.
పౌరేభ్య: ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామిన:..1.11.23..

క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలఙ్కృతమ్.
ధూపితం సిక్తసమ్మృష్టం పతాకాభిరలఙ్కృతమ్..1.11.24..

తత: ప్రహృష్టా: పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్.
తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా ..1.11.25..

తతస్స్వలఙ్కృతం రాజా నగరం ప్రవివేశ హ.
శఙ్ఖదున్దుభినిర్ఘోషై: పురస్కృత్య ద్విజర్షభమ్..1.11.26..

తత: ప్రముదితాస్సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్.
ప్రవేశ్యమానం సత్కృత్య నరేన్ద్రేణేన్ద్రకర్మణా..1.11.27..

అన్త:పురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రత:.
కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్..1.11.28..

అన్త:పురస్త్రియస్సర్వాశ్శాన్తాం దృష్ట్వా తథాగతామ్.
సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానన్దముపాగమన్..1.11.29..

పూజ్యమానా చ తాభిస్సా రాజ్ఞా చైవ విశేషత:.
ఉవాస తత్ర సుఖితా కఞ్చిత్కాలం సహర్త్విజా..1.11.30..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే ఏకాదశస్సర్గ:..

Saturday, July 9, 2022

Tholi Ekadasi

తొలి ఏకాదశి 

శాన్తాకారం, భుజగ శయనం, పద్మ నాభం, సురేశం |
విశ్వాకారం, గగన సదృశం, మేఘ వర్ణం, శుభాంగం ||

లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగి హృద్యాన గమ్యం |
వందే విష్ణుం, భవ భయ హరం, సర్వ లోకైక నాథం  ||

    ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని. ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటారు. జీవుల కర్మఫలాల గురించి ఆలోచించి, నిద్ర లేవగానే ఎవరి కర్మలను బట్టి వారికి ఏ జన్మను ప్రసాదించాలో నిర్ణయిస్తారు.కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్ని ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ, మన తప్పుఒప్పులకు లెక్కలు వేయడానికి యోగనిద్రలోకి ఉపక్రమించే రోజు ఈ తొలిఏకాదశి.

ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత: !
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః !!

వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః !
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్. !!

ఈ రోజున ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమాలు:-

❄️ బ్రహ్మీ మూహుర్తంలో నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి.

❄️ దగ్గరలో ఉన్న నదిలో నదీస్నానం ఆచరించాలి.లేదా కనీసం బావి స్నానం అన్నా చేయాలి.

❄️ మనసా, వాచా అన్నింటిని శుద్ధి చేసుకుని, పూజగదిని శుభ్రం చేసుకుని భగవంతుని అలంకరించి శక్తి మేరకు ధూప, దీప, నైవేధ్యాలను, హారతిని సమర్పించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి.

అయ్యా! ఈ రోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ, మౌనవ్రతం చేస్తాను.నీ నామసంకీర్తనం తప్ప నా నోట కానీ, మనస్సులో కాని వేరే అలోచన రానివ్వను అని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి.

❄️ సాయంత్రం దీపారాధన చేసి రాత్రంతా కీర్తనలు చేసి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆరు గంటల లోపు ప్రసాదం స్వీకరించాలి.

ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్
వ్రతవర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః !!

భగవంతుడు యోగనిద్రలో ఉంటారు కదా, మనము చేసే పూజలు ఎవరికి చేరతాయి అనే అనుమానం మీరు పెట్టుకోనక్కరలేదు.
పరమాత్ముడికి ఐదు విభూతులు అని పేరు.

అందులో
🔹మొదటిది వైకుంఠంలో ఉండే ఆ శ్రీమహవిష్ణువుది పర అంటారు.ఈ స్వామి యోగనిద్రలోకి వెళ్ళి మన తప్పుఒప్పులను లెక్కలువేసి మన తదుపరి జన్మను నిర్ణయించేది.
🔹రెండోది క్షీరసాగరంలో వాసుకి మీద శయనించి ఉండే ఆ పరమాత్ముడిది, దీనినే వ్యూహం అంటారు.
🔹మూడోది అవతారాలలో ఉండే స్వామి అంటే రాముడు, కృష్ణుడు..వీరిని విభవము అంటారు.
🔹నాలుగోది, సర్వ జీవుల హృదయాలలో ఉండే స్వామిని అంతర్యామి అంటారు.
🔹ఐదోది మనము రోజు ఇంట్లో పూజించే స్వామి, అర్చ్యామూర్తీ అంటారు.

    మనము విన్నవించే విన్నపాలు, మన పూజలు స్వీకరించేది మన ఇంట్లో ఉండే అర్చ్యామూర్తీ.కనుక నిస్సందేహంగా ఆయనను పూజించి మీరు తెలిసితెలియక చేసిన తప్పులకు ఆయనను క్షమించమని మనస్పూర్తిగా వేడుకుని, మంచి జన్మను ప్రసాదించమని వేడుకోండి.

అన్ని ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమోత్తమమైంది. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు.

    ఏకాదశి మహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది.స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగశయనం,పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి.

    ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని సంభావిస్తారు. స్వామి యోగనిద్రకు ఉపక్రమిస్తాడనే జనులందరూ జనార్దనుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ,హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని శయనై కాదశిని వ్యవహరిస్తారు. ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షి ణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. కనుక ప్రత్యక్ష నారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశి శయనైకాదశిని పిలవడానికి కారణంగా చెప్తారు.

    శయనైకాదశి ఉపవాసవివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.

    ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి. 

    గోముఖ భాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి,అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు సర్వదేవతా నివాసస్థానమైన గోవు ను కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.అధర్వణవేదం, బ్రహ్మాండ,పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టత తెలుపుతాయ.


    'తొలిఏకాదశి’ రోజున గోశాలను శుభ్రముచేసి అలికి చుట్టూ ముగ్గులు, మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపై ఉంచి, విధివిధానంగా పూజిస్తూ. గంధపుష్పాలతో అర్చించాలి.  ఒక్కొక్క పద్మముపై  ఒక్కో అప్పడం ఉంచుతారు. ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకిస్తారు. ఇలా గోమాతను పూజించిన వారికి  సకల అభీష్టములు తప్పక తీరుతాయి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి. మహావిష్ణువుకు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి వివిధరకాల పండ్లను నివేదిస్తారు. 

    ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు,అంబరీషుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత కూడా ఏకాదశివ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశీ వ్రతం చేసేవారి యెడ సదా మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.

    బంధుమిత్రులందరు కలసి సాయంత్రపుపూట సామూహిక విష్ణుసహస్రనామావళిని పఠిస్తారు. ఈ రోజున పిప్పల వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు,ముల్లంగి, గుమ్మడికాయ,చెరకుగడలు వర్జించాలని అంటారు. మహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయి పైన పవళిస్తాడని యతులు సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశ సంచారులైన యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. 
                                                                         
    ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని  ఆషాఢ ఏకాదశి అని,శయన ఏకాదశి అనికూడా అంటారు. చాతుర్మాస్యవ్రతం ఈ రోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాస తొలిఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

     ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలి పై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. 

    ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు. 

    ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ,హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించ కూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారం టారు. 

    ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్య ప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవల సిన పథ్యమేఉపవాసం. 'లంకణం పరమౌషధ' మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం,ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. 

ఏకాదశి వ్రతం నియమాలు :-

🔸1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 
🔸2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 
🔸3. అసత్య మాడరాదు. 
🔸4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 
🔸5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 
🔸6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 
🔸7. అన్నదానం చేయాలి.

    పురాణ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అంటారు. 


    ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలం లో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.

    పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్త్రీ చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. 

    ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భ వించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.

    మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో విశ్రాంతి తీసు కుంటున్నారు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింప జేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.

    తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించి నందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. 
    
    ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి. అప్పటి నుంచే ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం.

    పురాణగాథ ప్రకారం, యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారక లోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి.

    దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు.  దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకలసౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు. రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలందరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.  

    తెలుగువారి తొలి పండుగగానూ గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది.



Tuesday, July 5, 2022

Srimadramayanam 10th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  10 వ సర్గము 

ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట, శాంతను వివాహమాడుట.

సుమన్త్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా.
యథర్శ్యశృఙ్గస్త్వానీత శ్శ్రుణు మే మన్త్రిభిస్సహ..1.10.1..

రోమపాదమువాచేదం సహామాత్య: పురోహిత:.
ఉపాయో నిరపాయో.?యమస్మాభిరభిచిన్తిత:.. 1.10.2..

ఋశ్యశృఙ్గో వనచరస్తపస్స్వాధ్యయనే రత:.
అనభిజ్ఞస్స నారీణాం విషయాణాం సుఖస్య చ.1.10.3..

ఇన్ద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభి: .
పురమానాయయిష్యామ: క్షిప్రం చాధ్యవసీయతామ్.. 1.10.4..

గణికాస్తత్ర గచ్ఛన్తు రూపవత్యస్స్వలఙ్కృతా:.
ప్రలోభ్య వివిధోపాయైరానేష్యన్తీహ సత్కృతా:..1.10.5..

శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్.
పురోహితో మన్త్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా..1.10.6..

వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్.
ఆశ్రమస్యావిదూరే.?స్మిన్ యత్నం కుర్వన్తి దర్శనే..1.10.7..
ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసిన:.

పితుస్సనిత్యసన్తుష్టో నాతిచక్రామ చాశ్రమాత్..1.10.8..
న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా.
స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సర్వం నగరరాష్ట్రజమ్.. 1.10.9..

తత: కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా.
విభణ్డకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాఙ్గనా:..1.10.10..

తాశ్చిత్రవేషా: ప్రమదా గాయన్త్యో మధురస్వరా:.
ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్.. 1.10.11..

కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్.
ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస న:.. 1.10.12..

అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియ:.
హార్దాత్తస్య మతిర్జాతా వ్యాఖ్యాతుం పితరం స్వకమ్..1.10.13..

పితా విభణ్డకో.?స్మాకం తస్యాహం సుత ఔరస:.
ఋశ్యశృఙ్గ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి..1.10.14..

ఇహాశ్రమపదో.?స్మాకం సమీపే శుభదర్శనా:.
కరిష్యే వో.?త్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్..1.10.15..

ఋషిపుత్రవచశ్శ్రుత్వా సర్వాసాం మతిరాస వై.
తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తా:.. 1.10.16..

ఆగతానాం తత: పూజామృషిపుత్రశ్చకార హ.
ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలమిదం ఫలం చ న:..1.10.17..

ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకా:.
ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధు:..1.10.18..

అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ .
గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్..1.10.19..

తతస్తాస్తం సమాలిఙ్గ్య సర్వా హర్షసమన్వితా:.
మోదకాన్ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్..1.10.20..

తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే.
అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్..1.10.21..

ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ.
గచ్ఛన్తి స్మాపదేశాత్తా భీతాస్తస్య పితుస్స్త్రియ:..1.10.22..

గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజ:.
అస్వస్థహృదయశ్చాసీద్దు:ఖం స్మ పరివర్తతే..1.10.23..

తతో.?పరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్.
మనోజ్ఞా యత్ర తా దృష్టా వారముఖ్యాస్స్వలఙ్కృతాః..1.10.24..

దృష్ట్వైవ చ తాస్తదా విప్రమాయాన్తం హృష్టమానసా:.
ఉపసృత్య తతస్సర్వాస్తాస్తమూచురిదం వచ:..1.10.25..

ఏహ్యాశ్రమపదం సౌమ్య! హ్యస్మాకమితి చాబ్రువన్.
తత్రాప్యేష విధిశ్శ్రీమాన్ విశేషేణ భవిష్యతి..1.10.26..

శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయఙ్గమమ్.
గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియ:..1.10.27..

తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్మహాత్మని.
వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా..1.10.28..

వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిప:.
ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వశ్శిరసా చ మహీం గత:..1.10.29..

అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతస్సుసమాహిత:.
వవ్రే ప్రసాదం విప్రేన్ద్రాన్మా విప్రం మన్యురావిశేత్..1.10.30..

అన్త:పురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్త్వా యథావిధి.
శాన్తాం శాన్తేన మనసా రాజా హర్షమవాప స:..1.10.31..

ఏవం స న్యవసత్తత్ర సర్వకామైస్సుపూజిత:.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే దశమస్సర్గ:..

Srimadramayanam 9th Verse of Balakanda Sri Valmiki Maharshi

Monday, July 4, 2022

Srimadramayanam 9th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  9 వ సర్గము

సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగునిగూర్చి సంక్షిప్తముగ చెప్పుట




ఏతచ్ఛ్రుత్వా రహస్సూతో రాజానమిదమబ్రవీత్.
ఋత్విగ్భిరుపదిష్టో.?యం పురావృత్తో మయా శ్రుత:..1.9.1..

సనత్కుమారో భగవాన్పూర్వం కథితవాన్కథామ్.
ఋషీణాం సన్నిధౌ రాజన్! తవ పుత్రాగమం ప్రతి..1.9.2..

కాశ్యపస్యతు పుత్రో.?స్తి విభణ్డక ఇతి శ్రుత:.
ఋష్యశృఙ్గ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి..1.9.3..

స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరస్సదా .
నాన్యం జానాతి విప్రేన్ద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ..1.9.4..

ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మన:.
లోకేషు ప్రథితం రాజన్విప్రైశ్చ కథితం సదా..1.9.5..

తస్యైవం వర్తమానస్య కాలస్సమభివర్తత .
అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్..1.9.6..

ఏతస్మిన్నేవ కాలే తు రోమపాద: ప్రతాపవాన్.
అఙ్గేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబల:.. 1.9.7..

తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా .
అనావృష్టిస్సుఘోరా వై సర్వభూతభయావహా ..1.9.8..

అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దు:ఖసమన్విత:.
బ్రాహ్మణాన్శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి.. 1.9.9..

భవన్తశ్శ్రుతధర్మాణో లోకచారిత్రవేదిన: .
సమాదిశన్తు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ..1.9.10..

వక్ష్యన్తి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగా:.
విభణ్డకసుతం రాజన్సర్వోపాయైరిహానయ..1.9.11..

ఆనాయ్య చ మహీపాల! ఋశ్యశృఙ్గం సుసత్కృతమ్.
ప్రయచ్ఛ కన్యాం శాన్తాం వై విధినా సుసమాహిత: ..1.9.12..

తేషాం తు వచనం శ్రుత్వా రాజా చిన్తాం ప్రపత్స్యతే .
కేనోపాయేన వై శక్య ఇహానేతుం స వీర్యవాన్ ..1.9.13..

తతో రాజా వినిశ్చిత్య సహ మన్త్రిభిరాత్మవాన్.
పురోహితమమాత్యాంశ్చ తత: ప్రేష్యతి సత్కృతాన్..1.9.14..

తే తు రాజ్ఞో వచశ్శ్రుశృత్వా వ్యథితా వినతాననా:.
న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యన్తి తం నృపమ్ .. 1.9.15..

వక్ష్యన్తి చిన్తయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్.
ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి.. 1.9.16..

ఏవమఙ్గాధిపేనైవ గణికాభి: ఋషేస్సుత:.
ఆనీతో.?వర్షయద్దేవశ్శాన్తా చాస్మై ప్రదీయతే..1.9.17..

ఋశ్యశృఙ్గస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి.
సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా..1.9.18..

అథ హృష్టో దశరథస్సుమన్త్రం ప్రత్యభాషత.
యథర్శ్యశృఙ్గస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్..1.9.19..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే నవమస్సర్గ:

Friday, July 1, 2022

Srimadramayanam 8th Verse of Balakanda Sri Valmiki Maharshi

శ్రీ వాల్మీకి మహర్షి  రచించిన శ్రీమద్రామాయణం నందలి బాలకాండ లోని  8 వ సర్గము 

సంతానోత్పత్తికై దశరథుడు అశ్వమేథయాగము చేయ సంకల్పించుట

తస్య త్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మన:.
సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత:..1.8.1..

చిన్తయానస్య తస్యైవం బుద్ధిరాసీన్మహాత్మన: .
సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహమ్..1.8.2..

స నిశ్చితాం మతిం కృత్వా యష్టవ్యమితి బుద్ధిమాన్.
మన్త్రిభిస్సహ ధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభి:..1.8.3..
తతో.?బ్రవీదిదం రాజా సుమన్త్రం మన్త్రిసత్తమమ్.
శీఘ్రమానయ మే సర్వాన్గురూంస్తాన్ సపురోహితాన్..1.8.4..

తతస్సుమన్త్రస్త్వరితం గత్వా త్వరితవిక్రమ: .
సమానయత్స తాన్ సర్వాన్ సమస్తాన్వేదపారగాన్..1.8.5…
సుయజ్ఞం వామదేవం చ జాబాలిమథ కాశ్యపమ్.
పురోహితం వసిష్ఠం చ యే చాన్యే ద్విజసత్తమా:..1.8.6..

తాన్పూజయిత్వా ధర్మాత్మా రాజా దశరథస్తదా.
ఇదం ధర్మార్థసహితం శ్లక్ష్ణంవచనమబ్రవీత్..1.8.7..

మమ లాలప్యమానస్య పుత్రార్థన్నాస్తి వై సుఖమ్.
తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ..1.8.8..

తదహం యష్టుమిచ్ఛామి శాస్త్రదృష్టేన కర్మణా.
కథం ప్రాప్స్యామ్యహం కామం బుద్ధిరత్రవిచార్యతామ్..1.8.9..

తతస్సాధ్వితి తద్వాక్యం బ్రాహ్మణా: ప్రత్యపూజయన్.
వసిష్ఠప్రముఖాస్సర్వే పార్థివస్య ముఖాచ్చ్యుతమ్..1.8.10..

ఊచుశ్చ పరమప్రీతాస్సర్వే దశరథం వచ:.
సమ్భారాస్సమ్భ్రియన్తాం తే తురగశ్చ విముచ్యతామ్..1.8.11..

సర్వథా ప్రాప్స్యసే పుత్రానభిప్రేతాంశ్చ పార్థివ.
యస్య తే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగతా..1.8.12..

తత: ప్రీతో.?భవద్రాజా శ్రుత్వా తద్విజభాషితమ్.
అమాత్యాంశ్చాబ్రవీద్రాజా హర్షపర్యాకులేక్షణ:..1.8.13..

సమ్భారాస్సమ్భ్రియన్తాం మే గురూణాం వచనాదిహ.
సమర్థాధిష్ఠితశ్చాశ్వస్సోపాధ్యాయో విముచ్యతామ్..1.8.14..

సరయ్వాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతామ్.
శాన్తయశ్చాభివర్ధన్తాం యథాకల్పం యథావిధి..1.8.15..

శక్య: ప్రాప్తుమయం యజ్ఞస్సర్వేణాపి మహీక్షితా.
నాపరాధో భవేత్కష్టో యద్యస్మిన్క్రతుసత్తమే..1.8.16..

ఛిద్రం హి మృగయన్తే.?త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసా: .
నిహతస్య చ యజ్ఞస్య సద్య: కర్తా వినశ్యతి ..1.8.17..

తద్యథా విధిపూర్వం మే క్రతురేష సమాప్యతే .
తథా విధానం క్రియతాం సమర్థా: కరణేష్విహ..1.8.18..

తథేతి చాబ్రువన్సర్వే మన్త్రిణ:ప్రత్యపూజయన్.
పార్థివేన్ద్రస్య తద్వాక్యం యథాజ్ఞప్తం నిశమ్య తే..1.8.19..

తథా ద్విజాస్తే ధర్మజ్ఞా వర్ధయన్తో నృపోత్తమమ్.
అనుజ్ఞాతాస్తతస్సర్వే పునర్జగ్ముర్యథాగతమ్..1.8.20..

విసర్జయిత్వా తాన్విప్రాన్సచివానిదమబ్రవీత్.
ఋత్విగ్భిరుపదిష్టో.?యం యథావత్క్రతురాప్యతామ్..1.8.21..

ఇత్యుక్త్వా నృపశార్దూలస్సచివాన్సముపస్థితాన్.
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతి:..1.8.22..

తతస్స గత్వా తా:పత్నీర్నరేన్ద్రో హృదయప్రియా:.
ఉవాచ దీక్షాం విశత యక్ష్యే.?హం సుతకారణాత్..1.8.23..

తాసాం తేనాతికాన్తేన వచనేన సువర్చసామ్.
ముఖపద్మాన్యశోభన్త పద్మానీవ హిమాత్యయే..1.8.24..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే బాలకాణ్డే అష్టమస్సర్గ: